Hari Hara Veeramallu: ‘హరిహర వీరమల్లు’పై హైపర్ ఆది రివ్యూ.. ఏం చెప్పారంటే..?
Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం నేడు (జులై 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రీమియర్ షోలు వీక్షించిన తర్వాత ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది తన రివ్యూని సోషల్ మీడియాలో పంచుకున్నారు. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానిగా పేరున్న హైపర్ ఆది, ‘హరి హర వీరమల్లు’ చిత్రం అభిమానులకు ఓ పెద్ద పండుగలాంటిదని పేర్కొన్నారు.
సినిమా చూసిన తర్వాత హైపర్ ఆది తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ, “హరి హర వీరమల్లు చాలా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్‌కే థియేటర్లో అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. సినిమాలో హై ఇచ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్, దానికి ఎం.ఎం. కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతి ఒక్కరికీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఆ ఉత్సాహంతోనే మీరందరూ థియేటర్ నుంచి బయటికి వస్తారు” అని వ్యాఖ్యానించారు.
ఆఫ్ స్క్రీన్‌లో చూశాం.. ఇప్పుడు ఆన్ స్క్రీన్‌పై చూడండి
ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను చాలాసార్లు సెట్‌కి వెళ్ళానని హైపర్ ఆది వెల్లడించారు. “పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు నచ్చే సినిమా తీయాలని ప్రతి సీన్ మీద కూడా చాలా కేర్ తీసుకున్నారు. అది ఈరోజు స్క్రీన్ మీద స్పష్టంగా కనిపించింది. క్లైమాక్స్ ప్రతి అభిమానినీ కదిలించింది” అని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.
https://www.instagram.com/reel/DMePQtit-OO/?utm_source=ig_web_copy_link
‘గబ్బర్ సింగ్’ తర్వాత అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ కోరుకున్న పెద్ద హిట్ ‘హరి హర వీరమల్లు’ అని హైపర్ ఆది అభిప్రాయపడ్డారు. “ఆఫ్ స్క్రీన్‌లో ధర్మం కోసం పోరాడిన పవన్ కళ్యాణ్ గారిని చూశారు. ఇప్పుడు ఆన్ స్క్రీన్‌లో ధర్మం కోసం పోరాడుతున్న హరి హర వీరమల్లుని కూడా చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ఆయన విజ్ఞప్తి చేశారు.
