Intinti Gruhalakshmi:అనారోగ్యం పాలైన “ఇంటింటి గృహలక్షి” కస్తూరి..ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?
తెలుగు అభిమానులకి నటి కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..గతంలో కమల్ హాసన్ చెల్లిగా “భారతీయుడు” సినిమాలో నటించిన కస్తూరి… ఈ మధ్య తెలుగు సీరియల్ “ఇంటింటి గృహలక్ష్మి” తో తులసి అనే సాధారణ గృహిణి పాత్రలో తెలుగు ప్రేక్షకులకి బాగానే దగ్గర అయింది.
ఆ సీరియల్ లో మధ్య తరగతి గృహిణి పడే కష్టాలు,భర్త నుండి విడిపోయిన తరువాత సమాజంలో ఆమె ఎదుర్కునే ఎదురుదెబ్బలు ఎలా ఉంటాయ్ అనేది తెరపై చూపిస్తుంది. దీనితో తులసి కి చాలా మంచి ఫాలోయింగ్ నే సంపాదించుకుంది. అలాగే సోషల్ మీడియా తరచూ ఆక్టివ్ గా ఉండే కస్తూరి.. తాజాగా తన ఆరోగ్యం గురించి ప్రేక్షకులతో ఒక విషయం షేర్ చేసింది..
“తనకి చికెన్ పాక్స్ (అమ్మవారు) సోకిందని.. అందువల్ల శరీరం అంతా వికృతం గా మారుతుందని.. దీనివల్ల ముఖం, శరీరం పై ఎలాంటి మచ్చలు ఉన్నాయో చూడండి” అంటూ.. తన లేటెస్ట్ ఫోటోలు అభిమానులతో పంచుకుంది. అయితే “ఎప్పటిలాగే నా అభిమానులు అందరి ఆశీర్వాదం నాకు ఉంటుందని.. ఉండాలని” చెప్పుకొచ్చింది ఈ గృహలక్ష్మి..!!