సడన్ గా మెగాస్టార్ చిరంజీవి అందరికీ షాక్ ఇచ్చారు. ఆచార్య చిత్రం కోసమో లేక మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించబోతున్న వేదాళం రీమేక్ కోసమో తెలియదుగానీ గుండు తో ఉన్న పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఇటు అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
తమిళంలో అజిత్ నటించిన వేదాళం మూవీ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఏమైందో తెలియదు గానీ ఆ చిత్రం ఆగిపోయింది. ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్న చిత్రం అదే కథతో తీయబోతున్నారు. ఆ చిత్రం కోసమే ఈ కొత్త లుక్ అనే ప్రచారం ఊపందుకుంది.
