Jailer Collections : సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన స్టైల్ తో ప్రేక్షకుల నాడిని పట్టుకున్న సూపర్ స్టార్.. తన నటన విశ్వరూపంతో ఇంకా సినీ జగత్తును ఏలుతూనే ఉన్నాడు.. అందులో భాగంగానే ఆయన నటించిన జైలర్ సినిమా ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది.
కొత్త కుర్ర హీరోలకి ఛాన్స్ ఇవ్వాలి, సీనియర్ హీరోలంతా రిటైర్డ్ అయిపోవడమే మంచిది అని ప్రేక్షకుల నుండి నెగటివ్ గా వస్తున్న నేపథ్యంలో రజనీకాంత్ జైలర్ మూవీలో యాక్ట్ చేసి తన సత్తా మరోమారు చాటుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికంటే ఎక్కువగా నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తూ ఉంది.12 రోజుల్లోనే సునామీ లాగా కాసుల పంట పండిస్తుంది. జైలర్ మూవీ హాలిడేస్ లోనే కాకుండా వర్కింగ్ డేస్ లో కూడా కలెక్షన్స్ ని కురిపిస్తుంది.

ఈ సినిమా రెండో వారంలోకి ప్రవేశించి వారాంతంలో కూడా మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. మొత్తంగా 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా డ్రాప్స్ ను జైలర్ మూవీ సొంతం చేసుకుంది. ఈ మూవీ కోటి నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబట్టడం, సినిమా మొత్తం మీద ఇప్పుడు 1.02 కోట్ల షేర్ ను వసూలు చేయడం గమనార్హం. 12 రోజుల్లో జైలర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ముఖ్యంగా నైజాం, ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీగా కలెక్షన్లను రాబట్టి, 12 రోజుల్లో 41.39 షేర్ రావటమే కాక, 70.20 గ్రాస్ నీ వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జైలర్ మూవీకి మొత్తంగా 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఊహలను తారుమారు చేస్తూ ఏకంగా 28.39 కోట్ల లాభాలతో ఈ సినిమా ఇంకా దూసుకెళ్తూనే ఉంది. 12వ రోజు వరల్డ్ వైడ్ గా 12.60 కోట్ల గ్రస్ ను సొంతం చేసుకుంది అంటే ఈ సునామీ ఎలా ఉందో ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నాం.

ప్రపంచవ్యాప్తంగా జైలర్ సినిమా 12 రోజుల కలెక్షన్స్ తమిళనాడు ఇటు, రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు కర్ణాటక, కేరళ, రెస్టాఫ్ ఇండియాలో తమిళ వెర్షన్ ని కలుపుకొని మొత్తంగా 173.90 కోట్లు వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ కలెక్షన్లు 518 గ్రాస్ ను కలెక్ట్ చేశాయి. 253.5 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ చూసుకుంటే 518 కోట్ల గ్రాస్ మార్కులు అందుకుంది. ఇక 124 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ మీద ఏకంగా 129.55 కోట్ల రేంజ్ లో అత్యధిక లాభాలతో ముందుకు దూసుకెళ్తుంది..
