Janhvi Kapoor Peddi Movie Remuneration: రాంచరణ్ పెద్ది మూవీపై భారీ అంచనాలు
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్ కి దేశవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రాంచరణ్ కొట్టిన క్రికెట్ షాట్ అయితే అవుట్ ఆఫ్ ది పార్క్ అనే చెప్పాలి. ఆ షాట్ ని సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ రీ క్రియేట్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.
ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో పెద్దిపై మెగా ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ మూవీలో రాంచరణ్ కి జోడిగా తొలిసారి జాన్వి కపూర్ నటిస్తోంది.
పెద్ది చిత్రానికి జాన్వీ కపూర్ రెమ్యునరేషన్
పెద్ది చిత్రానికి గాను జాన్వీ కపూర్ భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి జాన్వీ కపూర్ ఏకంగా 6 కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటోందట. దేవర చిత్రానికి జాన్వీ కపూర్ 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంది. ఇప్పుడు పెద్ది చిత్రానికి అంతకుమించేలా రెమ్యునరేషన్ పెంచేసింది.
Janhvi Kapoor
సౌత్ లో జాన్వీ కపూర్ క్రేజ్ క్రమంగా పెరుగుతోంది. తన డిమాండ్ కి తగ్గట్లుగానే జాన్వీ కపూర్ పారితోషికం తీసుకుంటోందని విశ్లేషకులు అంటున్నారు. ఆరు కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధపడి మరికొందరు సౌత్ నిర్మాతలు ఆమెతో సినిమా తీసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దేవర చిత్రం పర్వాలేదనిపించే విజయం సాధించింది. పెద్ది కూడా హిట్ అయితే సౌత్ లో జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ గా పాగా వేయడం కాయం.