Janhvi Kapoor Remuneration : అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ధడక్ మూవీతో బాలీవుడ్ కు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. మొదటిసారి ఎన్టీఆర్ 30తో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది జాన్వీ కపూర్. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా ఇటీవల జాన్వీ బర్త్ డే సందర్భంగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
యంగ్ టైగర్ తో యంగ్ శ్రీదేవి జతకడుతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఓన్లీ పోస్టర్ రిలీజ్ తోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లైక్స్, రీట్వీట్స్, కామెంట్స్ తో రికార్డు సృష్టించారు. ఈ మూవీలో జాన్వీ పల్లెటూరి అమ్మాయిలా కనిపించనుందని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం జాన్వీ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది.
ఈ మూవీ కోసం జాన్వీ పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకుంటుందని టాక్. NTR 30 ప్రాజెక్ట్ కోసం జాన్వీ దాదాపు రూ. 5 కోట్లు తీసుకుంటుందట. బాలీవుడ్ లో ఒక్క మూవీకి 3 కోట్లు వసూలు చేస్తుందట జాన్వీ. కానీ టాలీవుడ్ లో ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ మూవీతో జాన్వీకి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి.
Discussion about this post