Jr NTR : ఒక ప్రాంతీయ భాషా చిత్రం గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంది. ఒక తెలుగు సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డులకెక్కింది. ఓ దర్శకుడు కన్న కల కోసం చిత్ర బృందమంతా కలిసి కొన్ని ఏళ్లపాటు శ్రమించింది. బాహుబలి అనంతరం టాలీవుడ్ టాప్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అంతర్జాతీయ వేదికలపై RRR మూవీ అనేక అవార్డులను సొంతం చేసుకోగా.. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్ కోసం ఎదురు చూస్తుంది. ఇప్పటికీ RRR టీం US లో పలు అవార్డ్ ఫంక్షన్స్ కి, ఇంటర్వ్యూలకు హాజరవుతుండగా.. జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు తారక త్నను కోల్పోయినందున వారితో కలిసి వెళ్లలేకపోయాడు.
అయితే ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ ఆస్కార్స్ కి బయల్దేరాడు. హైదరాబాద్ విమానాశ్రయంలో కెమెరాకు చిక్కిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జూనియర్ US లో ఉన్న చరణ్, రాజమౌళి మరియు అతని RRR టీమ్‌తో జాయిన్ అవుతాడు. మార్చి 12 ఆస్కార్స్ అవార్డ్స్ వేడుకలు జరుగనున్నాయి.
Discussion about this post