Jr NTR – Prabhas: బాహుబలి తర్వాత వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు రెబల్ స్టార్. ఈ క్రమంలో సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ మూవీస్ కు కమిట్ అయ్యాడు ప్రభాస్. కానీ ఈ టైములో ప్రభాస్ నుంచి మంచి మాస్ మూవీ వస్తే.. అది బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సలార్ అదే స్థాయిలో ఉంటుందని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు.
రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. కె.జి.ఎఫ్ సిరీస్ కు పని చేసిన టీం ఈ చిత్రానికి కూడా పనిచేస్తుండడం మరో విశేషం. అయితే సలార్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వినిపించనుందని టాక్. తారక్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమా ఎండ్ అవనుందట. సలార్ మూవీకి ఎన్టీఆర్31 మూవీకి లింక్ ఉంటుందని
ఈ కారణంగానే తారక్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమాను ముగించనున్నారని సమాచారం. అయితే సలార్ రెండు భాగాలుగా తెరకెక్కుతుందనే వార్తల్లో నిజం లేదని మరికొందరి వాదన. ఏదేమైనా సలార్ మూవీకి సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఈ దసరా కానుకగా విడుదల కానున్న సలార్ అన్నీ రికార్డులను బ్రేక్ చేయనుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.