Jr NTR : స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు పెట్టుకొని ఇండస్ట్రీలో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ 18 ఏళ్ళ వయస్సులోనే ఎలాంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు వచ్చింది.
తారక్ తర్వాత చేయబోయే సినిమాలపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆస్కార్స్ కోసం నిన్న US వెళ్లిన విషయం తెలిసిందే. కాలిఫోర్నియాలో ఉన్న తారక్ ఈ రోజు ఉదయం ఓ క్రేజీ పిక్ ని షేర్ చేసి తన ఫ్యాన్స్ కి ఒక మోస్ట్ ఎనర్జిటిక్ ఉదయాన్ని అయితే పరిచయం చేశారు. తన ట్యాగ్ కి మరియు సినిమాలో తనకి పులి తో ఉండే
సన్నివేశాలకి తగినట్టుగా తననుతాను రిప్రెసెంట్ చేసుకుంటున్నట్టుగా ఫోటోని వెనుక నుంచి షేర్ చేసాడు. నిన్న ఎన్టీఆర్ 30 అప్డేట్ తో పాటు ఈ రోజు ఊహించని ఈ పిక్ తారక్ ఫ్యాన్స్ కి మంచి జోష్ ఇచ్చింది. ప్రస్తుతం తారక్ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరో వైపు మన ఇండియన్ సినిమాకు ఆస్కార్ రావాలని అంతా ఆశిస్తున్నారు.
Discussion about this post