K Viswanath Passed Away : తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నో అపురూప చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు, కళాతపస్విగా పేరొందిన కాశీనాథుని విశ్వనాథ్ (92) కన్నుమూశారు(K Viswanath Passed Away Passed Away). వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
5 దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేసిన విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. ఫిబ్రవరి 19, 1930న గుంటూరు జిల్లా రెపల్లేలో జన్మించిన కె.విశ్వనాథ్ తెలుగు చలనచిత్ర సీమలో లెజెండరీ దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా సుపరిచితమే. ఈ క్రమంలో ఆయనకు జాతీయ పురస్కాలు, నంది పురస్కారాలు ఎన్నో దక్కాయి.
1992లో ఉమ్మది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను రఘుపతి వెంకయ్య పురస్కారంతో గౌరవించింది. 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగాను 2017లో దాదాసాహెబ్ పురస్కారం కూడా అందుకున్నారాయన.
ఆడియోగ్రాఫర్ సినిమాల్లో తన కెరీర్‌ను స్టార్ట్ చేసిన కె.విశ్వనాథ్ తన లాంగ్ కెరీర్‌లో 53 సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘ఆత్మ గౌరవం’, ‘చెల్లెలి కాపురం’, ‘కాలం మారింది’, ‘శారద’, ‘ఓ సీత కథ’, ‘జీవన జ్యోతి’, ‘శంకరాభరణం’, ‘సప్తపది’, ‘సాగరసంగమం’, ‘స్వాతి ముత్యం’, ‘సిరివెన్నెల’, ‘స్వయం కృషి’, ‘స్వర్ణకమలం’, ‘సూత్రధారులు’, ‘శుభసంకల్పం’…
ఇలా ఒక్కటేంటి అన్నీ అద్భుతమనే చెప్పాలి. కళలు, సంప్రదాయాల మీద ఆయన సినిమాలు ఎక్కువగా తెరకెక్కేవి. మెయిన్ స్ట్రీమ్ సినిమాలు దూసుకుపోతున్న సమయంలోనే ఆయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ రాణించారు. ఆయన సినిమాలు కొన్ని రష్యన్ భాషలోకి డబ్బింగ్ చేశారు కూడా. వాటిని మాస్కోలోని థియేటర్లలో విడుదల చేశారు.
కె.విశ్వనాథ్ తన కెరీర్‌లో తొమ్మిది బాలీవుడ్ సినిమాలను కూడా తెరకెక్కించారు. వాటితోపాటు టీవీ సీరియళ్లలోనూ నటించారు. దర్శకుడిగా ఆయన ఆఖరి సినిమా ‘శుభప్రదం’. ఈ సినిమాలో 2010లో వచ్చింది. నటుడిగా అయితే 2016లో వచ్చిన ‘హైపర్’లో ఆఖరిగా తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. గతేడాది ‘ఒప్పండ’ అనే కన్నడ సినిమాలో నటించారు.
Also Read : బంగారం ధరించేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తే.. సంపద మీ సొంతమవుతుంది..!
శంకరాభరణం విడుదలైన రోజే..
ఈ లెజెండరీ డైరెక్టర్ చేతుల్లోంచి జాలువారిన ఆణిముత్యం ‘శంకరాభరణం’. ఆయన చిత్రాల్లో ఈ ‘శంకరాభరణం’చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1980 ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం తెలుగు చిత్రపరిశ్రమలో ఒక సంచలనం. సంగీతమే ప్రాధాన్యంగా వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ హంగులు లేకున్నా అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ చిత్రానంతరమే కె.విశ్వనాథ్ ‘కళాతపస్వి’గా పేరుపొందారు. అయితే ‘శంకరాభరణం’ విడుదలైన రోజే ఆయన శివైక్యం చెందడం బాధాకరం.