Kajal aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యింది. కెరీర్లో మంచి ఫామ్లో ఉండగానే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ పై దృష్టి పెడుతుంది కాజల్ అగర్వాల్.
తాజాగా సినిమా సెట్లోకి అడుగు పెట్టింది. డైరెక్టర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న భారతీయుడు 2లో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో తిరిగి పాల్గొనట్లు ట్విటర్లో ఫోటోను పెట్టి ‘భారతీయుడు 2 త్వరలో వచ్చేస్తుంది’ అంటూ రాసుకొచ్చింది. ఈ సినిమాలోని తన పాత్ర కోసం గుర్రపు స్వారీలో శిక్షణ కూడా తీసుకొంది కాజల్.
చాలాకాలం తరవాత తిరిగి షూటింగ్ కి రావడం సంతోషంగా ఉందని, కొత్త నైపుణ్యాలను నేర్చుకొని వాటిని అలవాటుగా చేసుకోవడం తనకు ఇష్టమని చెప్పింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని పాన్ ఇండియా మూవీలో ఏడుగురు విలన్లు ఉన్నారట. అనిరుధ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా, లైక ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. అక్టోబర్ లో ఇండియన్ 2 విడుదల చేయనున్నారు.
Discussion about this post