Khushi Movie Update: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్, యూత్ లో ఆయనకున్న క్రేజ్ గురించి తెలిసిందే. అర్జున్ రెడ్డి, గీతా గోవిందంతో మాస్ అండ్ క్లాస్ ఆడియెన్స్ కు చేరువయ్యాడు. అయితే విజయ్ ఈ రెండు చిత్రాలు తప్పా మిగతా మూవీస్ పెద్దగా హిట్ అవ్వలేదు. ఇటీవల విడుదలైన పాన్ ఇండియా మూవీ లైగర్ విజయ్ కేరీర్ బిగ్గేస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో విజయ్ తన ఆశలన్నీ నెక్స్ట్ మూవీ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ‘ఖుషి’ పైనే పెట్టుకున్నాడు.
ఈ మూవీలో విజయ్ కి జోడిగా సమంత నటిస్తుంది. మైత్రీమూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ తొలి షెడ్యూల్ ని కశ్మీర్లో పూర్తి చేసుకుంది. అనంతరం సమంత మయోసైటీస్ వ్యాధి కారణంగా షూటింగ్ కి కొంచెం గ్యాప్ ఇవ్వడంతో ‘ఖుషి’ చిత్రీకరణ ఆలస్యం అయింది. వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామ్ ఇటీవల ముంబైలో జరిగిన హిందీ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ షూటింగ్ లో పాల్గొన్నారు.
దీంతో త్వరలో ‘ఖుషి’ సినిమా షూటింగ్ లో పాల్గొననుందట. మార్చి మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందట. ఈ షెడ్యూల్లో విజయ్, సమంతలు పాల్గొంటారని టాక్. ఇదిలావుంటే ‘ఖుషి’ ని గత ఏడాది డిసెంబరు 23న రిలీజ్ చేయాలనుకున్నారు. షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ ఏడాది రిలీజ్ కానుంది.