Koratala Siva: మొన్నటి వరకు అపజయం ఎవరుగని స్టార్ డైరెక్టర్ గా కొనసాగాడు కొరటాల శివ. టాలీవుడ్ టాప్ హీరోలకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించాడు కొరటాల. ‘మిర్చి’ మూవీతో కొరటాల శివ దర్శకునిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ‘మిర్చి’ విజయంతో కొరటాల శివతో కలసి పనిచేసేందుకు టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా క్యూ కట్టారు. అలా రెండో సినిమాతోనే మహేశ్ లాంటి టాప్ స్టార్ తో పనిచేసే అవకాశం దక్కింది.
మహేశ్ తో కొరటాల తెరకెక్కించిన ‘శ్రీమంతుడు’ కూడా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తెరకెక్కించిన ‘జనతా గ్యారేజ్’తోనూ మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు శివ. అలా గ్రాండ్ సక్సెస్ లో హ్యాట్రిక్ చూసిన కొరటాల నాల్గవ చిత్రంగా మళ్లీ మహేష్ తో ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని తెరకెక్కించారు.
Also Read: చిరు క్రష్ ఎవరు.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..
వరుస విజయాలు సొంతగా చేసుకున్న కొరటాల ఐదో చిత్రంతో మెగాస్టార్ చిరంజీవిని ‘ఆచార్య’గా మలిచే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కలసి నటించినా, బాక్సాఫీస్ ఫలితం నిరాశ కలిగించింది. జయాపజయాలు ఎవరికైనా తప్పవు. కానీ టాప్ హీరోలకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన ఒక స్టార్ డైరెక్టర్ ఒక్క ఫ్లాప్ సినిమా తీయగానే అందరూ అతన్ని టార్గెట్ చేసి విమర్శించడం ప్రారంభించారు.
మార్కెటింగ్ మానేసి స్క్రిప్ట్ పై దృష్టిపెట్టాలి అంటూ విమర్శించారు. ఆచార్య ఫ్లాప్ కి కొరటాలే కారణం అన్నట్టూ వ్యవహరించారు. ఇప్పుడిప్పుడే ఆచార్య నుంచి బయటకు వస్తున్న కొరటాల ప్రస్తుతం యంగ్ టైగర్ యన్టీఆర్ హీరోగా NTR30 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. RRR తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. కానీ రాజమౌళి సినిమా తర్వాత ఆ హీరోలకు ఒక్క ఫ్లాప్ అయినా పడుతుందనే సెంటిమెంట్ కూడా ఎప్పటి నుండో ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేసిన “ఆచార్య” ఫ్లాప్ తో కొరటాలకి అనేక విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది.
ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అనే టెన్షన్ కొరటాలను వెంటాడుతోంది. ఇప్పటికే అప్డేట్స్ అంటూ ఫ్యాన్స్ మరింత ఒత్తిడి పెంచేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కోసం సెట్స్ రెడీ చేసుకునే పనిలో ఉంది మూవీ టీం. త్వరలో మొదలవనున్న ఈ మూవీ 2024 ఏప్రిల్ లో విడుదల కానుంది. ఈ మూవీతోనైనా కొరటాల శివ హిట్ కొట్టి తానేంటో మరోసారి నిరూపించుకుంటాడేమో చూడాలి.
Discussion about this post