• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Entertainment

Krish on HHVM: ‘హరి హర వీరమల్లు’కు ఆ ఇద్దరు లెజెండ్సే కారణం.. రిలీజ్‌కు ముందు పోస్ట్‌ క్రిష్ ఎమోషనల్ పోస్ట్!

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌కు ముందు పోస్ట్‌ క్రిష్ ఎమోషనల్ పోస్ట్!

Sandhya by Sandhya
July 22, 2025
in Entertainment, Latest News, Movie, Movie Updates
0 0
0
Krish on HHVM: ‘హరి హర వీరమల్లు’కు ఆ ఇద్దరు లెజెండ్సే కారణం.. రిలీజ్‌కు ముందు పోస్ట్‌ క్రిష్ ఎమోషనల్ పోస్ట్!
Spread the love

Table of Contents

Toggle
  • Krish on HHVM: ‘హరి హర వీరమల్లు’కు ఆ ఇద్దరు లెజెండ్సే కారణం..
    • లెజెండ్స్ వల్లే సాధ్యమైంది..
    • పవన్ కళ్యాణ్ అగ్ని కణం..
    • ఏఎం రత్నం నమ్మకం..

Krish on HHVM: ‘హరి హర వీరమల్లు’కు ఆ ఇద్దరు లెజెండ్సే కారణం..

 

Krish on HHVM: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఐదు సంవత్సరాల నిరీక్షణ తర్వాత తెరపైకి వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌, ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా, ఈ చిత్రానికి తొలుత దర్శకత్వం వహించిన క్రిష్ జాగర్లమూడి సోషల్ మీడియా వేదికగా చేసిన భావోద్వేగ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.

లెజెండ్స్ వల్లే సాధ్యమైంది..

‘హరి హర వీరమల్లు’ ప్రాజెక్ట్‌ ఆలస్యం కావడంతో క్రిష్ మధ్యలోనే తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సినిమాను పూర్తి చేశారు. అయితే, సినిమా విడుదల సందర్భంగా క్రిష్ తన మౌనాన్ని వీడారు. “ఇప్పుడు ఈ వీరమల్లు ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. నిశ్శబ్దంగా కాకుండా ఓ గొప్ప ఆశయంతో చరిత్రను ప్రజల ముందుకు తీసుకురానున్నాడు. ఈ చిత్రం ఇద్దరు లెజెండ్స్ వల్లే సాధ్యమైంది. వారు సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఎందరికో స్ఫూర్తి” అని క్రిష్ తన పోస్ట్‌లో రాశారు.

pawan kalyan

పవన్ కళ్యాణ్ అగ్ని కణం..

ఆ ఇద్దరు లెజెండ్స్‌లో ఒకరు పవన్ కళ్యాణ్ అని క్రిష్ తెలిపారు. “ఆయన నిత్యం రగిలే అగ్ని కణం. ఎందరికో ఆదర్శం. ‘హరి హర వీరమల్లు’కు ప్రాణం పోసింది ఆయనే. ఆయన ఈ చిత్రానికి వెన్నెముక వంటి వారు” అని పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కృష్ణా తీరంలో దొరికిన కోహినూర్ వజ్రం హైదరాబాద్ సుల్తానుల దగ్గరికి ఎలా వచ్చింది.. ఆ తర్వాత దాని ప్రయాణం ఎలా సాగింది అనే నేపథ్యంలోని కథ ఇది అని వివరించారు.

ఏఎం రత్నం నమ్మకం..

మరో లెజెండ్ నిర్మాత ఏఎం రత్నం అని క్రిష్ పేర్కొన్నారు. “భారతీయ సినీ రంగంలో తనకంటూ గొప్ప అనుభవాలను పోగేసుకున్న శిల్పి. ఎంతో విశ్వాసంతో దీన్ని నిర్మించారు. ఇలాంటి సామర్థ్యం, పట్టుదల చాలా అరుదుగా ఉంటాయి. ఆయన అచంచలమైన నమ్మకం వల్లే ఇది సాధ్యమైంది” అని రత్నంకు కృతజ్ఞతలు తెలిపారు.

Now… Hari Hara Veera Mallu walks into the world. Not quietly.. but with purpose.. with the weight of history and passion behind every frame. This journey was made possible by two great legends… not just in cinema, but in spirit..

🔥Our PAWAN KALYAN garu.. an extraordinary… pic.twitter.com/KZo14F1M2a

— Krish Jagarlamudi (@DirKrish) July 22, 2025

“నాకెంతో ఉత్సాహాన్నిచ్చిన ప్రాజెక్ట్‌లలో ఈ సినిమా ఒకటి. ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది. దర్శకుడిగా మాత్రమే కాకుండా.. ఈ సినిమా కథను రూపొందించడంలోనూ ఎన్నో విషయాలు తెలుసుకున్నాను” అని క్రిష్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఐదు సంవత్సరాల నిరీక్షణ తర్వాత విడుదలకు సిద్ధమైన ‘హరి హర వీరమల్లు’ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమవుతుందని క్రిష్ ఆశాభావం వ్యక్తం చేశారు.


Spread the love
Tags: AM RatnamHari Hara Veera MalluKrish JagarlamudiPawan KalyanPeriod action filmTollywood movie releaseఏఎం రత్నంక్రిష్ జాగర్లమూడిజులై 24 విడుదలటాలీవుడ్ సినిమాపవన్ కళ్యాణ్హరి హర వీరమల్లు
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.