Krish with Balakrishna :క్రిష్ దర్శకత్వంలో బాలయ్య
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాలయ్య తదుపరి చిత్రం కూడా ఖరారైంది. వీరసింహారెడ్డి లాంటి హిట్ మూవీ తెరకెక్కించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో చిత్రానికి బాలయ్య కమిటయ్యారు. అయితే బాలయ్య ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేసేలా మరో న్యూస్ బయటకి వచ్చింది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలయ్య ముచ్చటగా మూడోసారి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ ఖరారైనట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో గౌతమి పుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు వచ్చాయి. గౌతమీపుత్ర శాతకర్ణి హిస్టారికల్ కాన్సెప్ట్ తో పర్వాలేదనిపించింది. కానీ ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం దారుణంగా డిజాస్టర్ అయింది.

ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్
కానీ క్రిష్ ప్రతిభపై బాలయ్యకి సందేహం లేదు. మూస చిత్రాలు కాకుండా క్రిష్ ఎప్పుడూ విభిన్నంగా ప్రయత్నిస్తుంటారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూడవ చిత్రం గురించి క్రేజీ వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య చాలా కాలంగా తన కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ హిట్ గా నిలిచినా ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు క్రిష్ తో చేయబోయే చిత్రం అదే అని వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రానికి ఆదిత్య 999 అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఈ వార్తలపై ఇటు క్రిష్ కానీ, బాలయ్య కానీ ఇంకా ఎవరూ అధికారికంగా స్పందించలేదు. త్వరలో దీనికి సంబంధించిన అన్ని వివరాలు బయటకి రానున్నాయి. గోపీచంద్ దర్శకత్వంలోని చిత్రం, క్రిష్ దర్శకత్వంలోని చిత్రం రెండూ దాదాపుగా ఒకేసారి షూటింగ్ జరుపుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.