Magadheera Re Release: పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన చిరుత మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే నటనతో ఆకట్టుకున్న చెర్రీ అనంతరం మగధీరతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. టాలీవుడ్ హిస్టరీలో కనీవినీ ఎరుగని సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది మగధీర. చారిత్రాత్మక నేపథ్యానికి, ప్రస్తుతానికి లింక్ చేస్తూ.. దర్శకధీరుడు రాజమౌళి తీసిన ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడేలా చేసింది.
అప్పట్లోనే రూ. 40 కోట్ల బడ్జెట్ వెచ్చించి, ఒక విజువల్ వండర్‌ని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించాడు జక్కన్న. ఈ సినిమాలో ప్రతీదీ అద్భుతమే. అటు రాజమౌళి క్రేజ్ ఇటు రామ్ చరణ్ క్రేజ్ కూడా ఈ సినిమాతో అమాంతం పెరిగిపోయాయి. ఈ మూవీలో చరణ్ కు జోడిగా కాజల్ నటించగ, M.M. కీరవాణి మ్యూజిక్ అందించాడు.
ఈ మెగా బ్లాక్ బస్టర్ ని మరోసారి బిగ్ స్క్రీన్ పై చూసే అవకాశం వచ్చింది. రాంచరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న మరోసారి థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్లు గీతా ఆర్ట్స్ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. దీనికి స్పందిస్తూ ఈ మూవీ కోసం వెయిటింగ్ అంటూ మెగా ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.