Mahesh Babu Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. ఇంతకు ముందు వీరి కాంబోలో అతడు, ఖలేజా వచ్చాయి. అయితే ఈ గుంటూరు కారం మూవీని మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కుస్తున్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు కాగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్ తో సోషల్ మీడియా షేక్ అవ్వగా తాజాగా విడుదలైన గుంటూరు కారం ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్ కి అందరి నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. అయితే ఈ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట గురూజీ. మరి త్రివిక్రమ్ ఏ స్టార్ హీరోయిన్ని అప్రోచ్ అవుతాడో.. ఎవరితో మహేష్ కి జోడిగా స్టెప్ లు వేయిస్తాడో చూడాలి.
ఇక వచ్చే షెడ్యూల్ లో ఈ సాంగ్ ను షూట్ చేయనున్నారు. సహజంగానే త్రివిక్రమ్ ప్రతి సినిమాలో హీరోయిన్ తో పాటు మరో హీరోయిన్ పాత్రను రాస్తుంటాడు. అందుకు కోసం పూజ హెగ్డే, శ్రీలీలను ఫైనల్ చేసేసారు. కానీ స్పెషల్ సాంగ్ కి మహేష్ కి పోటీగా ఎవరినీ సెలెక్ట్ చేస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతకొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ కి గ్యాప్ రాగా నెక్స్ట్ షెడ్యూల్ ని జూన్ సెకండ్ వీక్ నుంచి ప్లాన్ చేసారు మేకర్స్. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.