సినిమా హీరోలు నిజజీవితంలో కూడా తాము నటించిన పాత్రలలో ఉన్నంత ఔదార్యాన్ని చూపించడం అభినందించదగ్గ విషయం. ఈ విషయంలో తెలుగు హీరోలు మొదటి వరుసలో ఉంటారు.
శ్రీమంతుడు సినిమాలో ఊరిని దత్తత తీసుకున్నట్లే కృష్ణాజిల్లాలో బుర్రిపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇండస్ట్రీలో మహేష్ వివాదాలకు చాలా దూరంగా.. సాయం చేయడానికి చాలా ముందుగా ఉండే వ్యక్తి అని అంటూ ఉంటారు. ఆ మాటను మరోసారి నిరూపించుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. గతంలో ఎంతో మంది పసి పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలను నిలిపిన సూపర్ స్టార్ మహేశ్ బాబు. తాజాగా మరో గుండెను బతికించాడు.
తనుశ్రీ అనే చిన్నారికి హృదయ నాళానికి సంబంధించిన ఆపరేషన్ చేయించడం ద్వారా ఆ చిట్టితల్లి ఊపిరి పోసుకుంది అని ఆ పాప ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. చాలా ఆనందంగా ఉందని మహేశ్ భార్య నమ్రత తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చికిత్స చేసిన ఆంధ్రా ఆస్పత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందరి హీరోల అభిమానులు మహేష్ మంచితనాన్ని మెచ్చుకుంటున్నారు.