Mahesh Babu’s Character in the Movie Guntur Karam : మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా జనవరి 12 సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమమ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడం ఒక విషయమైతే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో నటించడం మరో విశేషం.
ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి పాటలు దుమ్మురేపాయి. యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ తో ఈ సినిమాలోని పాటలు దూసుకెళ్తున్నాయి. అయితే 12వ తారీకు అతి చేరువలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి అందులోనూ ముఖ్యంగా మహేష్ బాబు క్యారెక్టర్ కు సంబంధించి ఒక న్యూస్ నెట్ ఇంట్లో హల్చల్ చేస్తుంది.
ఇప్పటికే స్టార్ హీరోస్ కొన్ని క్యారెక్టర్లతో మనల్ని అలరించారు. ముఖ్యంగా కొన్ని లోపాలు ఉన్న క్యారెక్టర్స్ ఎంచుకొని వాటి ద్వారా సూపర్ హిట్లను కూడా అందుకున్నారు. వాటిల్లో ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన రంగస్థలం దాంట్లో రామ్ చరణ్ చెవిటివాడిగా నటించగా, అల్లు అర్జున్ నటించిన పుష్ప దాంట్లో అల్లు అర్జున్ గునివాడిగా నటించాడు,అలాగే తారక్ ఒక సినిమాలో నత్తి వాడిగా నటించారు.
ఇటువంటి సమస్య ఉన్నటువంటి పాత్రల్లో నటిస్తూ భారీ సక్సెస్ ని ఆ హీరోలు సొంతం చేసుకున్నారు. అయితే ఇలాంటి పాత్రలు మహేష్ బాబుకు సెట్ అవ్వని మహేష్ బాబు ఫీలింగ్. ఆ కారణంగానే పుష్ప సినిమా తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్టోరీ విని ప్రేక్షకులు నన్ను అలా చూడలేరు. నన్ను యాక్సెప్ట్ చేయరు అని ఆ సినిమాను రిజెక్ట్ చేశాడంట.
కానీ ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు సంబంధించి ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అయింది. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు కు ఒక కన్ను సరిగా కనిపించదని ఆయన ఆ లోపం ఉన్నటువంటి క్యారెక్టర్ లో నటించారని తెలుస్తుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్,వీడియోలు అవన్నీ చూసిన వారు మహేష్ బాబు ఇలాంటి లోపమున్న క్యారెక్టర్ చేస్తున్నారా.. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఎక్కడా కూడా చెప్పలేదు అని కామెంట్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు మోనాక్యులర్ విజన్ తో బాధపడే క్యారెక్టర్ లో కనిపించనున్నారంటూ తెలుస్తుంది. ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు. ఇప్పటివరకు మూవీ మేకర్స్ ఈ సినిమా పైన ఈ న్యూస్ పైన ఎలాంటి అఫీషియల్ గా స్పందించలేదు. కాబట్టి సినిమా వస్తే గాని దాంట్లో నిజం ఎంతో మనం చెప్పలేం.