“లక్స్ పాప లక్స్ పాప లంచ్ కోస్తావా.. ” బాలయ్య బాబు నుండి ఈ రేంజ్ లో మాస్ ని ఉర్రూతలూగించే సాంగ్ తెరపైన సందడి చేసి చాలా రోజులైంది. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ లేదు.ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ ప్రేక్షకులనే కాదు అభిమానులను కూడా నిరాశపరిచాయి. ఇప్పుడు ఆ లోటు తీర్చడానికి బాలయ్య బాబు కి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది.
అదేంటంటే ఈ చిత్రంలో బాలయ్య సరసన మలయాళీ నటి ప్రయాగా మార్టిన్ నటించబోతుందని తెలిసింది. ఈ అమ్మడు మలయాళంలో దాదాపు 10 కి పైగా చిత్రాలలో నటించింది. తెలుగులో ఆరేళ్ల క్రితం పిశాచి అనే చిత్రంలో నటించిన తర్వాత మరే చిత్రం చేయలేదు. రెగ్యులర్ గ్లామర్ పాత్రలు కాకుండా కేవలం నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ కేరళకుట్టిని బోయపాటి సినిమాలో తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉందనిపిస్తుంది. ఈ చిత్రంలో అఘోరా మరియు ఫ్యాక్షనిస్ట్ గా రెండు పాత్రలు పోషిస్తున్న బాలయ్య సరసన ధీటైన నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రకు మార్టిన్ ను తీసుకున్నట్లు సమాచారం.
ఫ్యాక్షనిస్టు పాత్రలో బాలయ్య ప్రత్యర్థులపై ఉగ్ర నరసింహుడులా విరుచుకుపడుతూ ప్రత్యర్థులను తుక్కు రేగేలా కోడుతుంటే B,C సెంటర్లలో ఈలలు, చప్పట్లతో పాటు కనక వర్షం కురుస్తుంది. ఈసారి బాలయ్య నుండి కచ్చితంగా అలాంటి చిత్రమే వస్తుందని అభిమానులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.
బోయపాటి బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి భారీ స్థాయి కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే #BB3 పేరుతో విడుదలైన టీజర్ కి బిగ్ అప్లాజ్ వచ్చింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తుండగా
మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.