Mammootty’s ‘Kaadal: The Core’ into OTT : విభిన్న పాత్రలను ఎన్నుకొని, విభిన్న చిత్రాలను అందించడంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిది ప్రత్యేకమైన స్థానం. ఆయన ఇటీవల నటించిన ప్రయోగాత్మక సినిమా ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. ఆ సినిమా ‘కాదల్: ది కోర్’. జియో బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జ్యోతిక హీరోయిన్ గా నటించింది.
అయితే ఈ సినిమా వివాదాలను ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఆ సినిమాలో ఎంచుకున్న మమ్ముట్టి పాత్ర. ఆ పాత్ర స్వలింగ సంపర్కుడిగా అంటే (గే) మమ్ముట్టి అందులో కనిపిస్తారు. దీంతో ఈ సినిమా పైన మొదటి నుంచి కూడా విమర్శలు, వివాదాలు తలెత్తాయి. ఈ సినిమా కథ హోమో-సెక్సువాలిటీని ప్రోత్సహించేలా ఉందంటూ, కువైట్ ఖాతార్ దేశాలు ఈ చిత్రాన్ని బ్యాన్ చేసేసాయి.
అయితే ఈ విమర్శలను దాటుకుంటూ నవంబర్ 23వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ లో ఇప్పుడు అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్వీస్ట్ కూడా దాగి ఉంది. ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి తెచ్చారు కానీ, దీన్ని ఫ్రీగా చూసే వీల్లేదని చిక్కుముడి పెట్టారు. ఈ మూవీ చూడాలంటే కచ్చితంగా డబ్బులు కట్టాల్సిందే. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన ఓటిటీలో రిలీజ్ చేశారు. మరి ఉచితంగా ఎప్పుడు అందుబాటులోకి తెస్తారో వేచి చూడాల్సిందే.