కలెక్షన్ కింగ్ వారసురాలిగాగా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మీ. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా టీవీ షోస్ మరియు కొన్ని అవార్డ్ ఫంక్షన్స్ లో యాంకర్ గా కూడా అలరిస్తుంది లక్ష్మీ.
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులతో అనేక విషయాలు పంచుకుంటుంది. అయితే మంచు లక్ష్మీ పెట్టిన అనేక పోస్ట్స్ వైరల్ అవుతూ ట్రోలింగ్ కి గురవుతుంటాయి. అయితే అప్పట్లో మంచు లక్ష్మీని మోహన్ బాబు టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్న ఓ స్టార్ కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట.
ఆయన మంచు ఫ్యామిలీకి చాలా క్లోజ్ అని, దగ్గర బంధువు అని తెలుస్తుంది. అయితే మంచులక్ష్మీ నాకు అప్పుడే పెళ్లి వద్దని చదువుకుంటానని విదేశాలకు వెళ్లిపోయిందట.
అంతేకాదు తనకు సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్లను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఖరాకండిగా చెప్పేసిందట. ఈ క్రమంలోనే బడా ఫ్యామిలీకి కోడలు అయ్యే చాన్స్ మిస్ చేసుకుంది మంచు లక్ష్మీ అంటూ ఓ న్యూస్ గతంలో ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ భర్త, ఓ పాపతో చాలా హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.