Manchu Manoj : డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు, యంగ్ హీరో మనోజ్ గురించి పరిచయం అక్కర్లేదు. దొంగ దొంగది సినిమాతో హీరోగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. బిందాస్ సినిమాకు రాష్ట్ర నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నాడు. వరుస ఫెయిల్యూర్లతో కేరీర్లో బాగా గ్యాప్ వచ్చేసింది. ప్రెసెంట్ మనోజ్ వాట్ ద ఫిష్ అనే క్రేజీ మూవీ ఒకటి చేస్తున్నాడు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే.. మరో మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.బికలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్..
మాస్ మాజరాజ్ రవితేజతో తీయబోయే చిత్రంలో మనోజ్ విలన్‌గా చేయనున్నట్టు సమాచారం. ఇందులో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా నటిస్తాడట. ఈ కేజీ కాంబోలో మనోజ్ విలన్ అనగానే అందరిలో ఆసక్తి మరింత పెరిగింది. అప్పట్లో డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా హీరోగా చేస్తూనే విలన్ గా నటించి మెప్పించాడు. ఇప్పుడు మనోజ్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నాడు అనిపిస్తుంది. సరైన పాత్ర పడితే మాత్రం మనోజ్ పెర్ఫార్మన్స్ తో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం ఖాయం.