Meenakshi Chaudhary in Ram Charan’s Movie : మీనాక్షి చౌదరి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి కొన్ని రోజులు గడుస్తున్నా కూడా తనకు మంచి సినిమా అవకాశాలు రాలేదని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు సరసన రెండో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ అమ్మడు మొదట్లో కిలాడి సినిమా చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ సరైన విజయాన్ని అందుకోలేకపోయింది.
ఆ తర్వాత నుంచి కూడా సరైన అవకాశాలు ఈ ముద్దుగుమ్మకు రాలేదు. అయితే అడవి శేషు హీరోగా నటించినటువంటి హిట్టు2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక అప్పటినుంచి ఈ అమ్మడికి సినిమా అవకాశాలు వెలువెత్తుతున్నాయి. గుంటూరు కారం సినిమాలో మొదట హీరోయిన్ గా పూజా హెగ్డేను అనుకున్నరు. తర్వాత ఆమె తప్పుకోవడంతో మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.
అలా ఈ భామకు మంచి ఛాన్స్ వచ్చింది. ఇటీవలే గుంటూరు కారం నుంచి మీనాక్షి చౌదరి లుక్ ను కూడా మూవీ మేకర్స్ విడుదల చేశారు. మహేష్ బాబుకు మరదలుగా ఈ అమ్మడు ఆ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈమెకు మరో జాక్ పాట్ ఛాన్స్ వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్నటువంటి సినిమా ఆర్శి 16లో మీనాక్షి చౌదరికి సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని ఒక వార్త ఇప్పుడు నెటింట్లో లో బాగా హల్చల్ చేస్తుంది. దీంతో మీనాక్షి చౌదరి బంపర్ ఆఫర్ కొట్టిందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒకేసారి ఈ వార్త వైరల్ అవ్వడంతో మీనాక్షి చౌదరి బాగా ఫేమస్ అయిపోయింది.