ప్రతి ఏడాది క్రిస్మస్ వేడుకలు కలిసి చేసుకోవడం మెగా ఫ్యామిలీలో ఒక ఆనవాయితీగా వస్తుంది. సాధారణంగా చిరంజీవి నివాసంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. తాజాగా మరొకసారి మెగా ఫ్యామిలీ యంగ్ బ్యాచ్ మొత్తం ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరొక నాలుగు రోజుల్లో క్రిస్మస్ రాబోతుంది.. దీంతో మెగా ఫ్యామిలీ కూడా క్రిస్మస్ పండుగకు రెడీ అయ్యింది.
నాలుగు రోజులు ముందుగానే అడ్వాన్స్ సెలెబ్రేషన్స్ ను స్టార్ట్ చేసింది మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీలోని యువతరం అంతా కలిసి అడ్వాన్స్ క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నట్టు తెలుస్తుంది. వీరంతా కలిసి చేసుకున్న ఈ సెలెబ్రేషన్స్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దీంతో ఈ సెలెబ్రేషన్స్ కు సంబంధించిన పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ ఫోటోలో మెగా హీరోలతో పాటు, మెగా కజిన్స్ అందరు కనిపిస్తున్నారు. ఈ ఫోటోలో రామ్ చరణ్ అతని భార్య ఉపాసన, అల్లు అర్జున్ అతడి భార్య అల్లు స్నేహ, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, శ్రీజ, నిహారిక తదితరులు కనిపిస్తున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి దిగిన ప్రతి ఫోటో వైరల్ అవుతూనే ఉంటుంది. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానులు పెద్ద త్రిల్ గా భావిస్తారు. ఇక క్రిస్మస్ సందర్భంగా అభిమానులకు మెగా ఫ్యామిలీ సర్ప్రైజ్ ఇచ్చిందనే చెప్పాలి.