Varun Tej Birthday Celebration with Blind People: మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ప్రతి సినిమాకి వైవిధ్యం చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఒకపక్క కామెడీ, మరోపక్క మాస్, ఇంకా రొమాంటిక్ స్టోరీలు చేస్తూ తనదైన శైలిలో సత్తా చాటుతున్నాడు. కాగా ఈరోజు (జనవరి 19) వరుణ్ తేజ్ పుట్టిన రోజు. సాధారణంగా మెగా హీరో బర్త్‌డేలంటే సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. అయితే మెగా ప్రిన్స్ మాత్రం ఇలాంటి ఆడంబరాలకు కాస్త దూరంగానే ఉంటాడు.

అయితే సేవా కార్యక్రమాల్లో మాత్రం తన పెద్ద నాన్న చిరంజీవి, పవన్ కల్యాణ్‌లనే ఫాలో అవుతుంటాడీ స్టార్ హీరో. తాజాగా తన పుట్టిన రోజున ఒక మంచి పనిచేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు వరుణ్. కాగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో వరుణ్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు, దేవానర్ బ్లైండ్ స్కూల్ పిల్లలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అంధ విద్యార్థులతో కలిసి నాగబాబు కేక్ కట్ చేసి వరుణ్ తేజ్ పుట్టినరోజుని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అనంతరం దేవనార్ బ్లైండ్ స్కూల్ కోసం వరుణ్ పంపిన లక్ష రూపాయల చెక్కును నాగబాబు అందజేశారు. ‘పిల్లల మధ్య ఇలా బర్త్ డే జరుపుకుంటే వారు కూడా చాలా సంతోష పడతారు. గతేడాది కూడా వరుణ్ ఇలాగే తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే తను బయటకి చెప్పుకోడు. ఇప్పుడు కూడా ఈ స్కూల్ కి రూ.1 లక్ష విరాళంగా ఇచ్చాడు అని చెప్పుకొచ్చారు నాగబాబు.
Mega Brother @NagaBabuOffl graced the birthday event of Mega Prince @IAmVarunTej in Chiranjeevi Blood Bank. Many fans & orphanage students attended the function.
On behalf of #VarunTej, he handed over a special donation cheque to Devnar School for The Blind. A great initiative pic.twitter.com/jDuzQCef5M
— MEGA SUPPORTERS (@MegaSupporters) January 19, 2023
