Ram Charan: నటనలో తండ్రి మెగాస్టార్ వారసత్వాన్ని, సేవలో బాబాయ్ పవర్ స్టార్ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఓవైపు సినిమాలో ఎంతగా బిజీగా ఉన్నప్పటికీ అభిమానులకు కూడా సమయాన్ని కేటాయిస్తాడు చెర్రీ. సామాజిక కార్యక్రమంలో ఎప్పుడూ ముందుండే చరణ్ తాజాగా ఓ అభిమానిని కలిసి అందరి దృష్టిని ఆకర్షించాడు. క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఓ చిన్నారిని నేరుగా వెళ్లి కలిశాడు చరణ్.
వివరాల్లోకి వెళితే.. మణి కౌశల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఆ కుర్రాడు రామ్ చరణ్‌ను కలవాలని ఆశపడ్డాడు(Ram Charan fulfils the wishes of a nine-year-old cancer patient). ఈ విషయాన్ని మేక్ ఏ విష్ అనే కార్యక్రమం ద్వారా చరణ్ తెలుసుకున్నాడు. వెంటనే చిన్నారి అభిమాని కోరికను తీర్చేందుకు నేరుగా రంగంలోకి దిగాడు చెర్రీ. క్యాన్సర్‌పై చిన్నారి చేస్తున్న పోరాటానికి కొండంత బలం ఇచ్చాడు. కాసేపు ఆ పిల్లాడితో ముచ్చటించి సరదాగా గడిపాడు.
Also Read: జగన్ కి బాబు బంపర్ ఆఫర్
అంతేకాదు కుర్రాడికి బహుమతిని కూడా ఇచ్చారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో చరణ్ పనికి తెగ ఖుషి అవుతున్నారు మెగా ఫ్యాన్స్. దటీజ్ మెగా పవర్ స్టార్, బాబాయ్ కి తగ్గ అబ్బాయ్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం చరణ్ శంకర్ డైరెక్షన్ లో RC15 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రెసెంట్ హైదరాబాద్ లో జరుగుతున్నట్టు సమాచారం.