Megastar Chiranjeevi Gifted to Bobby: మెగాస్టార్ చిరంజీవి ఆనందం మామూలుగా లేదు. చాన్నాళ్ల తర్వాత ఆయనకు వాల్తేరు వీరయ్య రూపంలో ఓ సాలిడ్ హిట్ పడింది. సినిమా వందకోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. కలెక్షన్స్ పరంగానే కాదు.. అభిమానులను అలరించి సంక్రాంతి విన్నర్‌గా సినిమా నిలిచింది. ఈ సక్సెస్‌పై మెగాస్టార్ చిరంజీవి చాలా సంతోషంగా ఉన్నారు.
వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అవ్వడంతో దర్శకుడు బాబీకి మెగాస్టార్ ఊహించని బహుమతి ఇచ్చినట్లు సమాచారం. సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసిన బాబీకి మెగాస్టార్ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడట. వాల్తేరు వీరయ్య హిట్ కావడంతో అతడిని స్వయంగా తన ఇంటికి విందుకు ఆహ్వానించడమే కాకుండా భోజం ముగిశాక లగ్జరీ కారు కానుకగా ఇచ్చినట్లు టాక్.
Gallery : Ashu Reddy Hot Photos in Saree
ఈ కారు విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే దీనిపై మెగాస్టార్ కానీ.. దర్శకుడు బాబీ కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇందులో నిజం తెలియాలంటే ఇద్దరిలో ఎవరొకరి నుంచి స్పందన రావాల్సి ఉంది. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య చిత్రం కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. చాలా రోజుల తర్వాత వింటేజ్ మెగాస్టార్‌ను చూస్తున్నామని అభిమానులు అంటున్నారు.