Chiranjeevi: ప్రముఖ సింగర్ స్మిత యాంకర్ గా ‘నిజం విత్ స్మిత’ టాక్ షో సోనీలివ్ ఓటీటీలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ షోకి ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరు పాల్గొన్నారు. ఫిబ్రవరి 10న ప్రసారమైన ఈ షోలో చిరు అనేక ఆసక్తికరమైన విషయాలకు పంచుకున్నారు. ఆయన సినీ జీవితంలో ఎదురైన సంఘటనలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్యతో వరుస హిట్లతో ఉన్న చిరు భోళా శంకర్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.
యంగ్ హీరోలకి పోటీగా చిరు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా షూటింగ్ గ్యాప్ లో చిరు సరికొత్త టాక్ షోలో పాల్గొన్నారు. ఇందులో చిరు మొదటిసారిగా తన చిన్ననాటి క్రష్ గురించి ఓపెన్ అయ్యారు. అందరి జీవితాల్లో చిన్నప్పుడు క్రష్ ఉన్నట్టే తనకి కూడా ఉందని, ఇప్పుడు పేర్లు అవి చెప్పి ఎందుకు ఇబ్బంది పెట్టడం.. ఇప్పుడు ఆ అమ్మాయి ఫ్యామిలీతో ఉండి ఉంటుంది.
Gallery: Nabha Natesh Hot Photos
పిల్లలు బహుశా మనవళ్ళు కూడా ఉంటారని నవ్వుతూ చెప్పారు చిరు. అంతేకాదు తన తమ్ముడు నాగబాబుతో కలిసి స్కూల్ టైంలో చేసిన అల్లర్లు అమ్మాయిల దృష్టిలో పడాలని బస్సులో వారి కోసం సీట్లు వదిలేయడం లాంటి ఎన్నో తాను చేసిన చిలిపి పనులు ఉన్నాయని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు చిరు. అయితే ఈ విషయాలన్నీ తన భార్య సురేఖకి తెలుసని చిరు కామెంట్స్ చేయడం కొసమెరుపు.