Megastar Zoom Call to NRI Mega Fans : NRI అభిమానులకు మెగాస్టార్ జూమ్ కాల్..!!
సంక్రాంతికి విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ట్రేడ్ పండితుల అంచనాలకు మించి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దిగ్విజయంగా దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన వాల్తేరు వీరయ్య విజయోత్సవాలని పురస్కరించుకుని అమెరికా వ్యాప్తంగా 28 సిటీలలో ఫ్యాన్స్ షోస్ ప్రదర్శించడం జరిగింది. విరామ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు జూమ్ ద్వారా జాయినయ్యి అభిమానులను ఉద్దేశించి ప్రసంగించి తన ఆనందాన్ని, అమెరికాలోని అనేక ప్రాంతాలతో తనకున్న జ్ఞాపకాల్ని పంచుకున్నారు.
మొదటిగా డల్లాస్ గురుంచి ప్రస్తావిస్తూ అక్కడ థియేటర్లో రెండొందలకు పైగా ఉన్న అభిమానులను ఉద్దేశిస్తూ ఇది అమెరికా బెజవాడ అని అనడంతో పెద్ద ఎత్తున అభిమానులు “టెక్సాస్ గడ్డ.. మెగాస్టార్ అడ్డా..” అంటూ స్లోగన్స్ ఇచ్చారు,
Also Read : బాలయ్య.. మారడయ్యా..!!
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన NRI ప్రముఖులు రవి వర్రే గారు, బద్రుద్దీన్ పీటర్, గోపాల్ గూడపాటి, సాయిరాజ్ కోతమస్, ఫణి ముత్యాల, రాజేష్ యాళ్లబండి గార్లకు అమెరికా మెగాభిమానులు ధన్యవాదాలు తెలిపారు