సెలబ్రెటీలపై రూమర్లు రావడం కామనే. కానీ నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు ఏదో చిన్న హింట్ ఉంటే తప్ప రూమర్లు కూడా అంతలా స్ప్రెడ్ అవ్వవు. కాగా, సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ తమన్నా పెళ్లి వార్తలు ఓ పక్క వైరల్ అవుతుండగా.. తాజాగా ఈ రూమర్స్‌పై తమన్నా స్పందించింది. గుర్తుందా సీతాకాలం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి మాట్లాడుతూ..‘కొంతమంది నా పెళ్లి ఎప్పుడో చేసేశారు.
ఒకసారి డాక్టర్.. మరోసారి బిజినెస్ మెన్ అంటూ.. ఏవేవో కథనాలు అల్లారు. అవన్నీ పుకార్లు మాత్రమే. నిజంగానే నా పెళ్లి ఫిక్స్ అయితే.. అందరితో నేనే షేర్ చేసుకుంటాను. జనరల్‌గా అందరి ఇళ్లల్లో అమ్మాయిలకు ఉన్నట్లే మా ఇంట్లో కూడా నా పెళ్లిపై ప్రెజర్ ఉంది. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఇప్పుడే నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, రూమర్స్ గురించి ఎక్కువగా ఆలోచించను.
ఎందుకంటే అది వారి పార్ట్ ఆఫ్ లైఫ్. నటించడం అనేది నా లైఫ్. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్‌ని సీరియస్‌గా తీసుకొను’ అని తమన్నా చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం తమన్నా చిరంజీవి భోళా శంకర్ సినిమాతో పాటు ఓ తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఇక సత్యదేవ్ తో ఆమె కలిసి నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ డిసెంబర్ 9న విడుదలకు సిద్ధంగా ఉంది.