Mokshagna Movie Entry : నందమూరి బాలకృష్ణ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక బ్రాండ్ ని సొంతం చేసుకొని, ఇప్పటికి కూడా దూసుకు వెళ్తున్నటువంటి హీరో. అయితే ఎంతో మంది హీరోలు తమ వారసులను ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారు. కానీ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అనేది మాత్రం స్పష్టత ఇన్ని రోజులు లేదు. మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి వస్తాడు అని బాలకృష్ణ మొదటి నుంచి చెబుతున్నా కూడా ఎప్పుడు అనేది ఖరారు చేయలేదు.
కానీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం 2024లో మోక్షజ్ఞ ఇంటర్వ్యూ ఉంటుందని బాలకృష్ణ స్పష్టం చేశారు. అయితే దానికి సంబంధించి దర్శకుడు ఎవరు, హీరోయిన్ ఎవరు, అనేది మాత్రం ఎటువంటి టాక్ బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో ఒక వార్త ఇప్పుడు చాలా హల్చల్ చేస్తుంది. మోక్షజ్ఞ ఎంట్రీ 2024లో కచ్చితంగా ఉంటుందని దానికి సంబంధించిన కథ కోసం మంచి డైరెక్టర్ ని కూడా వెతుకుతున్నట్టు తెలుస్తుంది.
అయితే కొందరి ఊహ ప్రకారం మొదటి సినిమా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తాడని, మరికొందరేమో అనిల్ రావిపూడి డైరెక్ చేస్తాడని అంచనా వేస్తున్నారు. కానీ బాలయ్య చూపు మొత్తం వకీల్ సాబ్ డైరెక్ట్ చేసిన వేణు శ్రీరామ్ మీద ఉన్నట్లు తెలుస్తుంది. వేణు శ్రీ రాము చేసినవి మూడు సినిమాలు అయినప్పటికీ అవన్నీ కూడా హిట్ గా నిలిచాయి. మోక్షజ్ఞను కూడా వేణు శ్రీను డైరెక్షన్ లో ఇండస్ట్రీకి పరిచయం చేయాలని బాలయ్య ఫిక్స్ అయినట్లు ఒక వార్త బయటకు వచ్చింది.
దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కు కూడా బాలయ్య కాల్ చేశాడని, వేణు శ్రీరామ్ గురించి అడిగి తెలుసుకున్నాడని తెలుస్తుంది. దానికి పవన్ కళ్యాణ్ వేణు చాలా మంచి డైరెక్టర్. వెరీ టాలెంటెడ్. తన డైరెక్షన్ లో నేను చాలా కంఫర్ట్ గా వర్క్ చేశాను. తను అయితే బాగుంటుంది అని వేణు శ్రీ రామ్ గురించి చెప్పినట్టు సమాచారం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలయ్య, వేణు శ్రీ రామ్ ని ఓకే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అందరూ ఊహించినట్టుగానే మోక్షజ్ఞ మొదటి సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయినట్టు ఒక వార్త ఇప్పటికే నెట్ ఇంట్లో హల్ చల్ చేస్తుంది.