Mrunal Thakur About Marriage: చిన్నతనం నుంచే పెళ్లిపై మృణాల్ కోరిక
సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులని మాయ చేసిన మృణాల్ ప్రస్తుతం అటు హిందీలో ఇటు తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అజయ్ దేవగన్ తో కలసి ఆమె నటించిన సన్నాఫ్ సర్దార్ 2 ఆగష్టు 1న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో మృణాల్ ఠాకూర్ ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
ఆమె తాజాగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొంది. ఫన్నీగా సాగిన ఈ షోలో మృణాల్ ఠాకూర్ కి పెళ్లి ఫ్యామిలీ లైఫ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు మృణాల్ బోల్డ్ గా బదులిచ్చింది. వాస్తవానికి తనకి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనే కోరిక చిన్నతనం నుంచే ఉండేదని బోల్డ్ గా చెప్పేసింది.

ఫోకస్ సినిమాలపైనే..
అయితే ఇప్పుడు మాత్రం పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో తెలియదు అని.. తన ఫోకస్ ప్రస్తుతం సినిమాలపైనే ఉందని పేర్కొంది. ఈ షోలో మృణాల్ ఠాకూర్ పొలిటీషియన్ ని పెళ్లి చేసుకుంటుందా లేక యాక్టర్ ని పెళ్లి చేసుకుంటుందా అని కూడా ప్రశ్నించారు.
ఇక మృణాల్ ఠాకూర్ సినిమాల విషయానికి వస్తే ఆమె చివరగా తెలుగులో హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం అడివి శేష్ కి జోడిగా డెకాయిట్ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల వీరిద్దరూ షూటింగ్ లో గాయపడ్డట్లు కూడా వార్తలు వచ్చాయి.
