Mrunal Thakur New Movie Update: సీతారామం.. ఈ ఒక్క సినిమాతోనే సౌత్ ఆడియన్స్ మనసు దోచిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ.. తెలుగు ప్రేక్షకుల మోస్ట్ ఫేవరెట్ లిస్ట్‌లో చేరిపోయింది. ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్రలో చాలా హుందాగా కనిపించి అచ్చ తెలుగమ్మాయి అనిపించుకుంది.
అయితే మృణాల్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న గ్లామరస్ పిక్స్ చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఏంటీ.. మన సీతా మహాలక్ష్మేనా అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు తనలోని కొత్త కోణాన్ని చూసి కంగుతింటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మృణాల్ మొదట తన కెరీర్ ను సీరియల్ ఆర్టిస్ట్ గా ప్రారంభించి ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
ఆమె గతం గురించి చెప్పాలంటే ఒక సోప్ అడ్వర్టిస్మెంట్ తో కెరీర్ ప్రారంభించి తర్వాత కుంకుమ భాగ్య అనే సీరియల్ తో ప్రజలకు దగ్గరైంది. ప్రెసెంట్ ఆమె హిందీలో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. అందులో భాగంగానే ఇపుడు ఆమె అక్షయ్ తో చేసిన సాంగ్ ఒకటి సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్’.. హిందీలో ‘సెల్ఫీ’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. అయితే అక్షయ్ కుమార్ పక్కన మృణాల్ కాసేపు స్క్రీన్ షేర్ చేసుకుంది. ‘కుడియీ నీ తేరి’ అనే సాంగ్ లో మృణాల్ గ్లామర్ ట్రీట్, హాట్ లుక్స్ తో అదరగొట్టింది. మరోవైపు మృణాల్ చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. బాలీవుడ్ లోని పూజా మేరీ జాన్, పిప్పా అనే చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Also Read: Amigos Heroine Ashika Ranganath Hot Photos
ఆంక్ మిచోలీ అనే మరో మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వీటికి తోడు నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘నాని 30’ లో కూడా హీరోయిన్ గా చేస్తుంది. కింగ్ నాగార్జున మూవీ కోసం మృణాల్ ని సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే కొరటాల శివ డైరెక్షన్ లో రానున్న ఎన్టీఆర్ 30 లో కూడా మృణాల్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఏదేమైనా మృణాల్ ఠాకూర్ తన కెరీర్ పరంగా దూసుకుపోతుండడంతో ఆమె అభిమానులు సంతోస్తున్నారు.
Discussion about this post