Thaman: సౌత్ లో ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యే సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు. క్రియేటవిటీ లేని ట్యూన్లు ఇస్తాడని.. కాపీ క్యాట్ మ్యూజిక్ డైరెక్టర్ అని.. తన ట్యూన్లు తానే కాపీ కొడతాడని రకరకాలుగా విమర్శలు చేస్తారు. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ అల వైకుంఠపురములో వంటి అద్భుతమైన మ్యాజిక్ ఆల్బమ్ క్రియేట్ చేశాడు తమన్. ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ తో పోలిస్తే తమన్ వేగంగా ట్యూన్లు అందించగలడనే పేరుంది.
ఇటీవల థమన్ సంగీత సారథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వీర సింహారెడ్డి ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు(Thaman relation with Jr NTR). ఇలా తమన్ ప్రతిసారి ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువస్తూ తనపై ప్రశంసలు కురిపించడానికి గల కారణం ఏంటంటే..
Also Read: ఇంట్లో బల్లులు కొట్లాడుకుంటే దేనికి సంకేతమో తెలుసా..!?
గతంలో ఎన్టీఆర్ బృందావనం సినిమా షూటింగ్ సమయంలో రెండు పాటలు కంపోజ్ చేయగా వంశీ వాటిని ఎన్టీఆర్ వద్దకు తీసుకువెళ్లారు. ఒకవేళ ఈ పాటలు కనుక నచ్చితే తనని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుందామని తెలిపారు. ఎన్టీఆర్ కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఆయన పెద్దగా వాల్యూం పెట్టుకొని పాటలు వింటారు. ఇలా నేను కంపోజ్ చేసిన పాటలు వింటూ మధ్యలోనే ఆపివేసి నా గురించి అడిగి తెలుసుకున్నారట.
అనంతరం నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావురా అని అడగడంతో వెంటనే నేను కళ్ళనిండా నీళ్లతో ఎన్టీఆర్ వద్దకు వెళ్లానని తెలిపారు. ఆరోజు ఎన్టీఆర్ నాకు ఫోన్ చేసిన సంఘటన నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. సాధారణంగా అవకాశాల కోసం మనమే ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అలాంటిది ఎన్టీఆర్ నన్ను పిలిచి స్వయంగా అవకాశం ఇప్పించడం నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఈ విషయంలో తాను ఎన్టీఆర్ కి ఎప్పటికీ రుణపడి ఉంటానని తమన్ తెలిపారు.