Naga Chaitanya Counter to Balakrishna : నందమూరి బాలకృష్ణకు అక్కినేని నాగ చైతన్య కౌంటర్..!!
ఇటీవల వీర సింహా రెడ్డి విజయోత్సవ వేడుకలో స్వర్గీయ ఎస్వీ రంగారావు,అక్కినేని గార్లపై నందమూరి బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యలకు అక్కినేని వారసుడు నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనమే కించపరచుకోడమే అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు చైతన్య.
— chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023
Also Read : బాలయ్య.. మారడయ్యా..
నాగ చైతన్య స్పందనపై అక్కినేని అభిమానుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు సినీ విశ్లేషకులు సైతం నాగ చైతన్య స్పందనను సమర్దిస్తుండగా నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అన్న సామెతను బాలకృష్ణ గుర్తెరిగి ప్రవర్తించాలి అని హితవు పలికారు.
Discussion about this post