Naga Chaitanya Custody Movie : ఈ సమ్మర్ లో ఫుల్ పాజిటివ్ వైబ్ తో విడుదలవుతున్న మూవీ కస్టడీ. స్టిల్స్, టీజర్, ట్రైలర్ తో సినిమాకు సూపర్ హైప్ వచ్చింది. ఈ మూవీని తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి గ్రాండ్ గా నిర్మించారు. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నాగ చైతన్య సరసన యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అరవింద్ స్వామి నెగటివ్ రోల్ చేస్తున్న ఈ మూవీకి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
మే 12న ఈ మూవీ విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో సినిమాను భారీ లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం దాదాపు 22 కోట్ల మేరకు థియేట్రికల్ బిజినెస్ చేయడం జరిగింది. ఈ సినిమా 22 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టాల్సి ఉంది. అయితే సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే సులువు అయ్యే అవకాశం ఉంది. ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించారు.