Naga Chaitanya Energetic Poster from Tandel : నాగచైతన్య చాలా రోజుల నుంచి ఫ్లాప్స్ చవి చూశాడు. ఈ యంగ్ హీరో మంచి హిట్ కొట్టేందుకు ఎంతో ఎదురు చూస్తున్నాడు. ఈ టైం లోనే ప్రేమమ్, సవ్యసాచి సినిమాల ద్వారా హిట్ అందించిన చందు మొండేటి డైరెక్షన్ లో నెక్స్ట్ సినిమాకి ప్లాన్ చేస్తున్నాడు. కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన చందు ముండేటి నాగచైతన్య కూడా హిట్ ఇవ్వాలని తాపత్రయంతో ఉన్నాడు.
ఇటీవలే ఈ సినిమాకు “తండేల్” అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. డిఫరెంట్ టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్రంపై ఆడియన్స్ భారీ హోప్స్ ని పెట్టుకున్నారని చెప్పవచ్చు. ఈ సినిమాను అధికారికంగా ఈ మధ్యనే ప్రకటించి గ్రాండ్ గా లాంచ్ కూడా చేశారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్యతో జోడి కట్టనుంది సాయి పల్లవి. ఇదివరకే వీరిద్దరూ లవ్ స్టోరీ సినిమాతో ఆకట్టుకున్నారు.

మళ్ళీ తాజాగా మరో మారు మన ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇచ్చారు. సినిమా షూట్ ని సముద్ర మధ్యలో స్టార్ట్ చేసినట్టు, నాగచైతన్య చాలా ఎనర్జిటిక్ గా ఉన్న పోస్టర్ ని వాళ్ళు రిలీజ్ చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని ఎక్సైటింగ్ అప్డేట్ ఇస్తామని కూడా మేకర్స్ చెప్పుకొస్తున్నారు.
అక్కినేని ఫ్యాన్స్ కి ఈ అప్డేట్ లుక్ తో ఫుల్ కిక్ వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం ఇస్తుండగా, గీత ఆర్ట్స్ 2 వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక వీళ్ళందరి కాంబో ప్రేక్షకులని ఎంతలా అలరిస్తుందో వేచి చూడాల్సిందే..
