సోషల్ మీడియా, యూ ట్యూబ్ వచ్చిన తర్వాత, తమ రేటింగ్ ల కోసం ఎన్నో వార్తలు సర్కులేషన్ అవుతున్నాయ్. వాటిలో ఏది నిజం? ఏది అబద్ధం అనేది ఆయా వార్తలకు సంబంధించిన వ్యక్తులు బయటకు చెప్పే వరకూ వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు.
రీసెంట్ టైమ్స్ లో అలా ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, కల్ట్ క్లాసిక్ గా నిలిచిన “సీతా రామం” మూవీ స్టోరిని న్యాచురల్ స్టార్ నానీ వదులుకున్నారని, ఆ స్టోరిని రిజక్ట్ చేసారనే వార్త చాలా యూ ట్యూబ్ చానల్స్ లో వచ్చింది.
దీనిపై డైరెక్టర్ అనీల్ రావిపూడి స్పందిస్తూ సీతారామం కథ వేరు, నానీతో తాను చెయ్యాలనుకున్న కథ వేరని అది కూడా మిలట్రీ బ్యాక్ డ్రాప్ కావడంతో దానికీ సీతారామంకి లింక్ చేసి ఇలాంటి తప్పులు కథనాలు ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.
నానితో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఒక స్టోరీని అనుకున్నామని, అది ఇంకా ఫైనల్ కాలేదని, అనీల్ రావిపూడి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.