Natu Natu Song Nominated For Oscar : దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఎట్టకేలకు ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌లో నిలిచింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ టాప్ -4లో నిలిచింది. ఇప్పటికే చలన చిత్ర పరిశ్రమలో రెండో ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును నాటు నాటు సాంగ్ కోసం ఆర్‌ఆర్‌ఆర్ అందుకున్న విషయం తెలిసిందే.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయిన రాజమౌళి.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో అంతర్జాతీయ దర్శకుడిగా మారిపోయాడు. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ ఇండియన్స్‌తో పాటు విదేశీయులను సైతం ఆకట్టుకుంది. అంతలా ఫిదా చేసింది కాబట్టే ఈ నాటు నాటు సాంగ్‌ను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. అనుకున్నట్టే ఫైనల్ నామినేషన్స్‌లో నిలిచింది
ఎన్టీఆర్‌కు నిరాశ..
జూ. ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ ఎదురైంది. మంగళవారం ప్రకటించిన ఆస్కార్ నామినేషన్లలో ఆయన పేరు కనిపించలేదు. ఆర్ఆర్ఆర్ చిత్రానికిగాను ఆయనకు ఉత్తమ నటుడు లేదా ఉత్తమ సహాయనటుడు నామినేషన్లలో ఏదో ఒకటి దక్కుతుందని వార్తలు వచ్చాయి.
అయితే ఈ రెండు కేటగిరీల్లోనూ ఆయన పేరు కనిపించలేదు. ఉత్తమ నటుడు కేటగిరీలో.. ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్), కాలిన్ ఫారెల్ (ద బ్యానిష్డ్ ఆఫ్ ఇనిషెరిన్), బ్రెండన్ ఫేజర్(ద వేల్), పాల్ మెస్కెల్(ఆఫ్టర్‌సన్), బిల నైటీ(లివింగ్) ఉన్నారు. ఎన్టీఆర్‌కు నామినేషన్ దక్కకున్నా ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటునాటు ‘ పాటకు నామినేషన్ దక్కండ కాస్తంత ఊరట.