Nayanthara: సినిమా ఇండస్ట్రీలో శారీరక కోరికలు తీర్చితే గానీ వేషాలు ఇవ్వమని నీచ సంస్కృతి (క్యాస్టింగ్ కౌచ్)పై చర్చనీయాంశమవ్వడం కనిపిస్తూనే ఉంటారు. అగ్రతారలకు కూడా తమ కెరీర్ ఆరంభంలో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవ్వడం మామూలే. ఇలాంటి సంఘటనలు పలువురు సినీ తారలు మీడియా ముందుకు వచ్చి సంచలనం రేపితే.. మరికొందరు పరువు కోసం మనసులోనే దాచుకొని మదనపడిన విషయాలు చాలానే ఉంటాయి.
అయితే తాజాగా ఓ నిర్మాత తన కోరిక తీర్చితే ఆఫర్ ఇస్తానని చెప్పిన విషయాన్ని, చేదు అనుభవాన్ని నయనతార ఇటీవల మీడియాలో బయటపెట్టారు. అప్పట్లో తనకు సౌత్ ఇండస్ట్రీలో ఓ పెద్ద సినిమాలో నటించే అవకాశం వచ్చిందని.. అయితే అందులో ఛాన్స్ కావాలంటే తమకు ఫేవర్ చేయాలని.. అడిగింది చేయాలని కోరినట్లు నయన్ చెప్పుకొచ్చారు. అడ్డదారుల్లో కాకుండా.. ప్రతిభపై ఎదగాలనుకున్నాను.. అందుకే ఆ అవకాశాన్ని తిరస్కరించినట్లు నయనతార వెల్లడించారు.
Also Read: పీరియడ్స్ టైంలో గుడికి ఎందుకు వెళ్ళకూడదంటే..?
ప్రజంట్ ఆమె వ్యాఖ్యలు సౌత్‌లో ప్రకపంనలు రేపుతున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖ నటీమణులు. క్యాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో మాత్రం పెద్దగా ఈ అంశంపై చర్చ జరగడం లేదు. తాజాగా నయన్ మాట్లాడటంతో క్యాస్టింగ్ కౌచ్ టాపిక్ మరోసారి వైరల్ అవుతుంది. ఇటీవల కనెక్ట్ లో నటించిన నయన్ ప్రజంట్ అట్లీ- షారుక్ ఖాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జవాన్’ మూవీలో ఆమె నటిస్తున్నారు.