జేమ్స్ బాండ్ వచ్చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు ఈ సిరీస్ లో 24 సినిమాలు రిలీజ్ అయ్యాయి. తాజాగా 25 వ చిత్రంగా తెరకెక్కిన “నో టైమ్ టు డై” చిత్రం నవంబర్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
కిడ్నాప్ చేయబడిన శాస్త్రవేత్తను రక్షించడానికి నియమించబడిన గూడచారి జేమ్స్ బాండ్ పాత్రలో డేనియల్ క్రేగ్ నటించిన ఈ చిత్రం గత ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. మెట్రో గోల్డెన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నవంబర్ లో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. భారత్ లో ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో “నో టైమ్ టు డై” పేరుతోనే విడుదల కాబోతోంది.