New song Promo from Guntur Karam : గుంటూరు కారం గా ఇంకో 15 రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ భారీ మాస్ యాక్షన్ మూవీ సినిమా కోసం ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ తో పాటు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో కొద్దిరోజుల ముందు నుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మూవీ మేకర్స్. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ప్రచార చిత్రాలు ఆడియన్స్ లో మంచి క్రేజ్ నెలకొల్పాల చేశాయి. ఇక ఇప్పుడు మూడో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు మూడో పాట “కుర్చీ మడత పెట్టి” సాంగ్ ప్రోమోన్ కూడా కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.
మాస్ నెంబర్ గా ఉన్న ఈ ప్రోమో అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. రామజోగేశాస్త్రి లిరిక్స్ రాయగా.. థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సాంగ్ లో మహేష్ బాబు,శ్రీలీల డ్యాన్స్ అదిరిపోయిందని చెప్పవచ్చు. రేపు ఫుల్ సాంగ్స్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా, జగపతిబాబు విలన్ పాత్రను పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.