Nidhhi Agerwal About Panchami role: జోరుగా హరిహర వీరమల్లు ప్రమోషన్స్
ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల వేగం పెంచింది. నిర్మాత ఏఎం రత్నం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథుల్ని ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు. మరోవైపు దర్శకుడు జ్యోతి కృష్ణ, నిధి అగర్వాల్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
Nidhhi Agerwal
నిధి అగర్వాల్ తన శక్తి వంచన లేకుండా హరిహర వీరమల్లుకు చేయాల్సిన పనులన్నీ బాధ్యతగా చేస్తోంది. హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో నిధి అగర్వాల్ హైలైట్ అవుతుందనే చెప్పాలి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రంలో పంచమి పాత్ర కోసం తాను చాలా కష్టపడినట్లు నిధి అగర్వాల్ తెలిపింది.
పంచమి పాత్రలో ట్విస్ట్
ప్రతిరోజు మేకప్ కోసమే రెండు గంటలు టైం పట్టేది. నేను ధరించే దుస్తులు, మేకప్ విషయంలో చిత్ర యూనిట్ చాలా కేరింగ్ తీసుకుంది. బెస్ట్ లుక్ తీసుకురావడం కోసం అందరూ ప్రయత్నించారు. అదేవిధంగా పంచమి పాత్ర కోసం ఫిజికల్ గా కూడా చాలా కష్టపడ్డాను. భరతనాట్యం, హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించాను అని నిధి అగర్వాల్ తెలిపింది.
Nidhhi Agerwal
ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కి తనకి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో అందంగా ఉంటాయని, అదేవిధంగా ఉత్కంఠ భరితంగా ఉంటాయని నిధి అగర్వాల్ పేర్కొంది. తాను పోషించిన పంచమి పాత్రలో ఒక ట్విస్ట్ ఉందని అది సినిమా చూసే తెలుసుకోవాలని నిధి అగర్వాల్ ఊరించింది.