Nidhhi Agerwal : పవన్ కల్యాణ్, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘హరి హర వీరమల్లు’. దీని అప్‌డేట్స్ కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘హరి హర వీరమల్లు’లో నిధి అగర్వాల్‌తో దిగిన ఫొటో కూడా ఉంది. ఈ ఫొటో స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన నిధి.. అది తన మొదటి సన్నివేశమని చెప్పింది. ఈ సందర్భంగా పవన్‌తో కలిసి నటించడంపై తన అనుభూతిని పంచుకుంది. ఆయనతో కలిసి నటించడంతో కల నెరవేరిన క్షణం ఆనందం వ్యక్తం చేసింది.
Priya Prakash Warrior : పాకిస్థాన్ లోనూ అభిమానులున్నారంటున్న యంగ్ బ్యూటీ..
”ఇలాంటి గొప్ప సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. అద్భుతమైన చిత్రబృందంతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను నమ్మండి.. మీరు త్వరలోనే థియేటర్లో అద్భుతాన్ని చూస్తారు” అంటూ పవన్ కల్యాణ్‌కు, క్రిష్‌కు కృతజ్ఞతలు తెలిపింది.ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.