Nithya Menon : నిత్యా మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తను ఎన్నుకునే కథలు తన నటన విధానం ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. తనకంటూ ఒక ఇమేజ్ నీ క్రియేట్ చేసుకుని ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూ, మంచి నటనతో ప్రేక్షకులకు దగ్గరైన మంచి నటి నిత్యమీనన్. తను రీసెంట్ గా యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ ఓటీటీలోకి రానుంది.
‘కుమారి శ్రీమతి’గా నిత్యా మీనన్!
నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటించిన ఓటిటీ ప్రాజెక్టు కుమారి శ్రీమతి త్వరలో ఓటిటిలో రిలీజ్ కానుంది. దీనికి అవసరాల శ్రీనివాస్ రైటర్ అండ్ క్రియేటర్. ఈ వెబ్ సిరీస్ ని తెలుగుతోపాటు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో అయినా ప్రముఖ ఓటీటీ కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ ని రూపొందించడం విశేషం.
వెబ్ ప్రాజెక్ట్స్ నిర్మించడం కోసం ప్రముఖ నిర్మాత సంస్థ కొత్త బ్యానర్ అయిన వైజయంతి మూవీస్ ‘ఎర్లీ మూన్ సూన్ టేల్స్’ ప్రారంభించింది. ఈ సంస్థతో కలిసి స్వప్న సినిమా ప్రొడ్యూస్ చేసిన వెబ్ సిరీసే ఈ కుమారి శ్రీమతి వెబ్ సిరీస్. శ్రీనివాస్ అవసరాల తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకుని ఉన్నారు. వెబ్ సిరీస్ టైటిల్ ని కూడా ఆయన చాలా డిఫరెంట్ గా ఎన్నుకున్నారు. నిత్యామీనన్ ఈ వెబ్ సిరీస్ లో ఒక పల్లెటూరి అమ్మాయి గా కనిపించనుందని సమాచారం.
ఆమె పేరు శ్రీమతి ఆమెకు పెళ్లి కాకపోవడంతో అందరూ ఆమెని కుమారి శ్రీమతి అని పిలుస్తారు. అందుకే వెబ్ సిరీస్ కి ఆ పేరు పెట్టారని చెప్తున్నారు. దీనికి గోమటేష్ ఉపాధ్యాయు దర్శకత్వం వహించారు. ఈరోజు కుమారి శ్రీమతి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు .అలాగే మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. చూడాలి ఇది ప్రేక్షకులను ఎంత అలరిస్తుందో.