NTR 30 Exclusive Update : RRR మూవీతో గ్లోబల్ స్టార్ అయిన ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గత కొన్నిరోజులుగా ఎన్టీఆర్ ఎక్కడకు వెళ్లిన అప్డేట్ అప్డేట్ అంటూ అరుస్తూ ఉంటే ఆఖరికి విసుగెత్తిపోయాడు జూనియర్. చివరకు మొన్న అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మూవీ అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ కొంత శాంతించారు. తాజాగా యూఎస్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘థ్యాంక్యూ ఎన్టీఆర్.. #NTR30 కోసం వేచి ఉండలేకపోతున్నాం’ అనే బ్యానర్ ను
ఎయిర్ జెట్ ద్వారా గాల్లో ఎగరేస్తూ వినూత్నంగా విష్ చేశారు. ఇదిలావుండగా ఈ నెల 23 నుంచి NTR30 పూజ కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు మేకర్స్ ప్రటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ నెల 31 నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభం కానున్నట్టు సమాచారం. మొదట వైజాగ్ లాంటి లొకేషన్స్ షూట్ చేయాలి అని నిర్ణయించున్నప్పటికీ
అనంతరం ప్లాన్ మార్చి హైదరాబాద్ లోనే చేయాలి అని నిర్ణయించుకున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా, ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుండగా.. యువసుధ బ్యానర్ పై కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.
Discussion about this post