NTR30 Movie : ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నా శుభతరుణం వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రం NTR 30 ఈ రోజు ఘనంగా స్టార్ట్ అయ్యింది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో ఐటీసీ కొహినూర్‌లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. RRR తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నార్త్ ఆడియన్స్ అంచనాలను ఎన్టీఆర్ అందుకోగా ఇండియాలో మోస్ట్ అవైటెడ్ పాన్
ఇండియా సినిమాల్లో NTR 30 ఒకటిగా ఇది నిలిచింది. ఈ సాలిడ్ ప్రాజెక్ట్ నందమూరి తారక రాముని ఆశీస్సులతో ఈ రోజు పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆస్కార్‌తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన దర్శకధీరుడు రాజమౌళి, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, ప్రశాంత్ నీల్‌తో పాటు మైత్రీ మూవీస్ నిర్మాతలు, దిల్ రాజు, ఏషియన్ సినిమాస్ నిర్మాతలు, సీనియర్లు బాపినీడు, కేఎస్ రామారావు,
శ్యాం ప్రసాద్ రెడ్డి తదితరులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే, బాలీవుడ్‌కు చెందిన కొందరు ప్రముఖులు కూడా విచ్చేయగా జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఇక రాజమౌళి ఫస్ట్ క్లాప్ ఇవ్వగా, కొరటాల శివ స్విచ్ ఆన్ చేశాడు, ప్రశాంత్ నీల్ ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశాడు. ఈ నెల 31 నుంచి ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్టు సమాచారం.
Discussion about this post