NTR30 Update : అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ధడక్ అనే మూవీతో బాలీవుడ్ కు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనువిందు చేస్తోంది. జాన్వీ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఓ సందర్భంలో బోనీ కపూర్ మాట్లాడుతూ..
మాకు దక్షిణాది చిత్ర పరిశ్రమ అంటే ఎంతో అభిమానం. ఇక్కడ సినిమాల్లో నటించడంతోనే శ్రీదేవి ఆల్ ఇండియా లేడీ స్టార్‌గా సత్తా చాటిన విషయాన్ని కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించాడు. మంచి కథ దొరికితే.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జాన్వీ తప్పకుండా నటిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే నిజమైంది. కొరటాల శివ దర్శకత్వంలో
ఎన్టీఆర్ 30 టైటిల్ తో త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీలో జూనియర్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తున్నట్టు మూవీ టీం ప్రకటించింది. జాన్వీ బర్త్ డే సందర్భంగా పోస్టర్ ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ నెల చివర్లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుండగా వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తొలిసారి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న జాన్వీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి..
Discussion about this post