NTR30 Update : జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ NTR 30. ఎట్టకేలకు NTR 30 పూజ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. గతకొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న NTR 30కి డేట్ ఫిక్స్ చేశారు. పూజ కార్యక్రమం అనంతరం త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు సమాచారం.
RRR తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవ్వడంతో కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం, తారకరత్న అకాల మరణంతో ఈ మూవీ వాయిదా పడుతూ వస్తుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా ఇటీవలే విడుదల చేసిన పోస్టర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
NTR 30లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా యువసుధ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.